AP: పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన ఆవిర్భావసభ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను కలిసినప్పుడు సార్ మీతో నాకు సినిమాలు తీయాలని ఉంది అని అడిగా అంటూ గుర్తు చేశారు. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా. ఇట్లాంటి బూతులు తిట్లే రాజకీయాలు మాకొద్దు సార్ అంటూ పేర్కొన్నారు.