వైసీపీ ఓటమికి అసలు కారణమిదే

71చూసినవారు
వైసీపీ ఓటమికి అసలు కారణమిదే
వైసీపీ ఓటమిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా బీజేపీకి దూరంగా ఉండే క్రిస్టియన్, మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువగా కలిగిన వైసీపీ.. కాషాయ పార్టీ విషయంలో తమ స్టాండ్ ఏంటో సరిగ్గా చెప్పకపోవడం వల్ల ఆ పార్టీకి భారీ డ్యామేజీ జరిగిందని అన్నారు. పైకి బీజేపీకి దూరంగా ఉంటున్నట్లు నటించినా.. లోపల మాత్రం వైసీపీ ఆ పార్టీ మద్దతు ఇచ్చిందని, అదే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పలేదన్నారు. రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అనేది చాలా ముఖ్యమని వైసీపీకి సూచించారు.

సంబంధిత పోస్ట్