నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం గ్రామంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సుమారు అరగంట పాటు వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పాటు వీధురు గాలులు వీచాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. చిరు వ్యాపారస్తులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఇదే తరహాలో వర్షం పడడంతో పశువుల కొట్టాలకు వేసిన రేకులు లేచిపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.