ఒకే స్టేషన్ లో ముగ్గురికి ఏఎస్ఐల నుంచి ఎస్ఐలుగా పదోన్నతి

70చూసినవారు
ఒకే స్టేషన్ లో ముగ్గురికి ఏఎస్ఐల నుంచి ఎస్ఐలుగా పదోన్నతి
నెల్లూరు జిల్లాలోని పలువురు ఏఎస్ఐలను ఎస్సైలుగా జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఐపీఎస్ పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎం. వెంకటేశ్వర్లు, వి. శ్రీనివాసులు, కే. మాల్యాద్రి అనే ముగ్గురు ఏఎస్ఐలు ఏకకాలంలో ఎస్సైలుగా పదోన్నతి పొందారు. ఒకే స్టేషన్లో ముగ్గురు ఏఎస్ఐ ల నుంచి ఎస్సైలుగా పదోన్నతి పొందడంతో తోటి సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్