రాష్ట్రంలోని రైతులు ప్రకృతి వ్యవసాయంలో శాస్త్రవేత్తలుగా మారే విధానం బాగుందని మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డీయాజ్ మరియా అన్నారు. తిరుపతి రూరల్ మండలం సి. గొల్లపల్లి గ్రామరైతు నాగరాజు పొలంలో మెక్సికో బృందం మంగళవారం విత్తనాలు నాటి ఏగ్రేడ్ గ్రాత్ క్రూపింగ్ మోడల్ పద్ధతిని పరిశీలించారు. ఘన జీవామృతం, బీజామృతంతో పాటు విత్తనశుద్ధి తయారీలను రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు.