తొట్టంబేడు మండలం గుండేలిగుంట హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. హెచ్ఎం ముని తిరుమలయ్య మాట్లాడుతూ. విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఐన్ స్టీన్ వంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని పైకి ఎదగాలన్నారు.