శ్రీగంధం తరలిస్తున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు అటవీ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. జిల్లా అటవీశాఖ అధికారి భరణి వివరాల మేరకు. చిత్తూరు పరిసరాల్లో శ్రీగంధం చెట్లను నరికి పక్క రాష్ట్రాలకు తరలించే 11 మంది దొంగల ముఠాను చిత్తూరు సమీపంలో పట్టుకున్నాం. వారి వద్ద నుంచి సుమారు రూ. 7లక్షల విలువ గల శ్రీగంధం చెక్కలతోపాటూ రెండు బైకులు సీజ్ చేశాం. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆమె వెల్లడించారు.