చిత్తూరు: బంగారు నగలు అపహరణ

70చూసినవారు
చిత్తూరు: బంగారు నగలు అపహరణ
ఇద్దరు మహిళల మెడలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు 62 గ్రాముల బంగారు నగలు అపహరించారు. ఆదివారం కొట్రకోనకు చెందిన హంసవేణి, శైలజ స్కూటీపై దొడ్డిపల్లి వైపు వస్తుండగా గుర్తుతెలియని ముగ్గురు బైక్ పై వచ్చి చిత్తూరుకు దారి ఏది అని అడుగుతూ ఇద్దరి మెడలో రూ. 2. 80 లక్షలు విలువచేసే బంగారు నగలను అపహరించారు. హంసవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సీఐ జయరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్