చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మంత్రి లోకేశ్ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు గురువారం అన్నారు. సభ స్థలానికి వచ్చే ముఖ్య అతిథులు, ప్రజల సౌకర్యం, భద్రత కోసం ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు.