వెదురుకుప్పం ఎంపీడీవోగా అమర్నాథ్

73చూసినవారు
వెదురుకుప్పం ఎంపీడీవోగా అమర్నాథ్
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం నూతన ఎంపీడీవోగా ఎ. అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో అమర్నాథ్ ఎర్రావారిపాలెంలో పనిచేశారు. బదిలీపై వెదురుకుప్పం రావడంతో స్థానిక ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్