జీడి నెల్లూరు: అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి

57చూసినవారు
అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్ చార్జ్  దెయ్యాల రమేష్ ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రంమంగళవారం అందజేశారు.

సంబంధిత పోస్ట్