రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు గ్రామంలో జనసేన పార్టీ ఇన్చార్జి యుగంధర్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.