
జీడి నెల్లూరు: లక్ష్మీ రెడ్డి పల్లెలో మన ఊరికి మన థామస్
జీడి నెల్లూరు మండలం లక్ష్మి రెడ్డి పల్లి హరిజనవాడ లో శనివారం రాత్రి మన ఊరికి మన థామస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం థామస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. చిన్న చిన్న సమస్యలను అప్పటికప్పుడు సంబంధిత అధికారులకు చెప్పి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.