జమ్మలమడుగు: వైసిపి ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు
జమ్మలమడుగు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నాయకులు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమితులైన సింగం శివ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఏపిపిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు. జిల్లాలో జగన్ రెడ్డి ఉక్కు పరిశ్రమకు టెంకాయలు కొట్టి వదిలేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.