రైలు ఎక్కుతుండగా కాలుజారి మహిళా మృతి
ఎర్రగుంట్ల మండలంలోని చిలంకూరుకు చెందిన సుజాత (35) శనివారం కొండాపురం రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి రైలుకు కింద పడిపోయింది. హుబ్లీ ప్యాసింజర్ రైలు స్టేషన్లో ఆగిన సమయంలో నీళ్లు తాగేందుకు వెళ్లి తిరిగి రైలు ఎక్కే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని రైల్వే పోలీసులు వెల్లడించారు.