కందుకూరు మున్సిపల్ కమిషనర్ గా అనూష బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న కమిషనర్ కృష్ణారెడ్డి నగరి కమిషనర్ గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సిబ్బంది సహకరించాలని ఆమె కోరారు. పలువురు సిబ్బంది కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.