కావలి పట్టణంలోని ఐడీఎస్ఎంటీ నుంచి వైకుంఠపురం ట్యాంకుకు వెళ్లే పైపులైన్ మరమ్మతుల కారణంగా బుధవారం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కావలి పురపాలక సంఘ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. వైకుంఠపురం ప్రాంతానికి పూర్తిగా నీటి సరఫరా ఉండదన్నారు. సరిచేసిన అనంతరం సరఫరా చేస్తామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని వివరించారు.