విడవలూరు మండలం విడవలూరు గ్రామంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూల గజ మాలలతో, టెంకాయ కర్పూరం వెలిగించి ఆంజనేయ స్వామికి పూజలు, అభిషేకాలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అంకమ్మ దేవాలయం గుడి వద్ద మధ్యాహ్నం 1 గంటకి గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.