శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి విశేష పూజలు

68చూసినవారు
శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి విశేష పూజలు
ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, ప్రత్యేక పుష్ప అలంకరణలో ఆలయాన్ని అందంగా అలంకరించారు. వరలక్ష్మి వ్రతం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్