నగిరికి చేరుకున్న దమ్మయాత్ర

53చూసినవారు
విజయ దశమిని పురస్కరించుకొని బౌద్ధులు, అంబేద్కర్ వాదులు, యువజన సంఘం సభ్యులు కేరళ నుంచి నిర్వహిస్తున్న దమ్మయాత్ర సోమవారం నగరి పట్టణానికి చేరుకుంది. ఈ యాత్రకు అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం జాతీయ, రాష్ట్ర నాయకులు సాదరంగా స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ యాత్ర నేటి మధ్యాహ్నానికి తిరుపతికి చేరుకుంటుందని నిర్వాహకులు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్