ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటు వేగం పుంజుకుంది. బుధవారం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస రెడ్డి టెండర్లను ఆహ్వానించారు. నగరి, ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించడం జరిగింది. ఇందులో నగరి మున్సిపాలిటీ లో 6 షాపులకు గాను లైసెన్స్ పొందడానికి రుసము రూ. 65 లక్షలు, నిండ్ర మండలం నందు ఒక షాపులకు రూ. 55 లక్షలు, విజయపురం మండలం నందు 4 షాపులకు లైసెన్స్ రుసము రూ. 55 లక్షలు నోటిఫై చేసినట్లు సీఐ ఒక ప్రకటనలో తెలిపారు.