నగరి పట్టణంలో జాతీయ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి జన్మదిన వేడుకలను బీఎస్పీ నగరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ నాగూర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం నగరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.