పుత్తూరు పట్టణంలోని కార్వేటినగరం రోడ్డు నందు వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి. గురువారం వీధి కుక్కలు 9 మందిని గాయపరిచాయి. గాయానికి గురైన వారు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉన్నత అధికారులు స్పందించి వెంటనే వీధి కుక్కల పై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.