చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గంలోని పుత్తూరు, నిండ్ర మండలాలలో బుధవారం నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పుత్తూరు మండలంలోని రాజేంద్ర ఆచారి కుటుంబాన్ని, నిండ్ర మండలం కొప్పెడు దళిత వాడలోని టిడిపి నాయకుల కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.