నగిరి: ప్రజలు క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి

51చూసినవారు
నగిరి: ప్రజలు క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి
నగిరి నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర, సోదరీమణులు క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం నియోజకవర్గంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన యుగకర్త ఏసుక్రీస్తు అని అన్నారు. ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం దయ, త్యాగం, ప్రేమ అలవర్చుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్