నెల్లూరు జిల్లాలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం నెల్లూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ప్రాంగణానికి చేరుకున్న ఎంపీ గారికి అధికారులు పుష్పగుచ్చం అందచేసి ఘన స్వాగతం పలికారు.