నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ తెలిపారు. ఆదివారం కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కమాండ్ కంట్రోల్ సెంటర్ మీటింగ్ హాల్లో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.