నెల్లూరు: ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాకు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది ప్రతి ఒక్కరు నిర్దేశించిన హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్ పేర్కొన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ వి. విజయన్ జిల్లాలోని శాఖ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం ఏడు డివిజన్లలో కంట్రోల్ రూమ్ లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సెలవులను వెంటనే రద్దు చేయాలన్నారు.