పలమనేరుకు చెందిన డాక్టర్ హర్షితకు ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ పీజీ ఇంట్రెన్స్ టెస్టులో ఆలిండియా స్థాయిలో 38వ ర్యాంకు సాధించింది. పలమనేరుకు చెందిన హర్షిత 99. 935 శాతంతో 38వ ర్యాంకు కైవసం చేసుకున్నట్లు తల్లిదండ్రులు డా. సావిత్రమ్మ, డా. సుబ్రమణ్యం తెలిపారు. చండీగఢ్ పీజీఐఎంఈఆర్ లో మెడికల్ సీటు సాధించినట్లు వారు బుధవారం తెలిపారు. హర్షిత అక్క, తల్లిదండ్రులు కూడా డాక్టర్లే కావడం విశేషం.