కర్ణాటక అక్రమ మద్యం నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ సురేశ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పెద్దపంజాణి మండలం చీకదిన్నె సమీపాన ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన శివశంకర్ వద్ద నిల్వ ఉన్న 40 ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండు పంపినట్లు సీఐ తెలిపారు.