బుచ్చినాయుడు కండ్రిగ మండలం కంచన పుత్తూరు గ్రామంలో శనివారం ఉదయం వెంకటేశ్వర స్వామి గుడిని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వైయస్సార్సీపి సీనియర్ నాయకులు గురవయ్య మాట్లాడుతూ. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతను దిగజార్చే విధంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పూజలు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.