కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి హైదరాబాద్ కు చెందిన సురేఖ దంపతులు వినాయకుడి ప్రతిమకు రెండు కేజీల కవచాన్ని బుధవారం ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు. వెండి కవచం విలువ సుమారు రెండు లక్షల 50 వేలు ఉంటుందని చెప్పారు.