కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలోని ఆస్థాన మండపంలో ఆదివారం 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆలయ ఏఈఓ ఎస్వి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఉచిత క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్యాంపుకు విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాసు పాల్గొన్నారు.