తవణంపల్లె: గంగమ్మకు పూజలు చేసిన మహిళలు

82చూసినవారు
చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో మండలంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాగా బోయిపల్లి-సరకల్లు మార్గంలో వరద ప్రవాహానికి బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. బస్సుల రాకపోకలు నిలిపివేశారు. చాలా రోజుల తరువాత అరగొండ వంక ప్రవహించడంతో స్థానిక మహిళలు బుధవారం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్