తవణంపల్లి: 104 సేవలను సద్వినియోగం చేసుకోవాలి: మెడికల్ ఆఫీసర్
104 సేవలను సద్వినియోగం చేసుకోవాలని తవణంపల్లి మెడికల్ ఆఫీసర్ వినయ్ కుమార్ మంగళవారం తెలిపారు. దిగువ మత్యంలో 104 వైద్య సేవలు నిర్వహించారు. ప్రజలకు ఇంటివద్దే వైద్య సేవలు అందిస్తున్నామని, అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు మాత్రలు అందజేస్తామన్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేస్తామన్నారు. హై రిస్క్ గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు.