రొంపిచర్ల మండలం చంచంరెడ్డిగారిపల్లె పంచాయతీ పరిధి బుసిరెడ్డిగారి పల్లెలో అక్రమంగా నిల్వ ఉంచిన 16 క్వార్టర్ల లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు రొంపిచర్ల ఏఎస్ఐ మధు శనివారం తెలిపారు. అందిన రహస్య సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా నాగయ్య అనే వ్యక్తి చింత చెట్టు కింద దాచిన బాటిళ్లను పట్టుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ పై విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.