కరెంటు షాక్ కొట్టి ఓ మహిళ గాయపడ్డ ఘటన పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలో గురువారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు మండలంలోని కాగతికి చెందిన సరస్వతి(45) ఇంటి దగ్గర ఉన్న పశువుల పాకలో లైటు వేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని 108లో వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.