రొంపిచర్లలో కమ్మేసిన పొగమంచు

53చూసినవారు
రొంపిచర్లలో సోమవారం ఉదయం పొగ మంచు విపరీతంగా కమ్మేసింది. మంచు ధాటికి వీధులలో జనసంచారం తగ్గింది. వాహనదారులకు రోడ్లు కనిపించక పోవడంతో లైట్లు వేసుకొని తిరిగారు. చలికి తట్టుకోలేక కొన్నిచోట్ల చలిమంటలు కాచుకున్నారు. మంచు ధాటికి ప్రజలు దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. రోజురోజుకు చలి, పొగమంచు తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు.

సంబంధిత పోస్ట్