కల్లూరులో ఆర్మీ జవాన్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

57చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం , కల్లూరు గ్రామంలో కాపురం ఉంటున్న ఆర్మీ జవాన్ ఎస్ అల్తాఫ్ లడక్ లో ఉద్యోగం చేస్తూ అనారోగ్యానికి గురై న్యూఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు ఆర్మీ జవాన్ స్వగ్రామమైన కల్లూరు గ్రామంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆర్మీ జవాన్ కు అంతక్రియలు నిర్వహించారు. అల్తాఫ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్