ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి గాయాలైన ఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా, పుంగనూరు సమీపంలోని కురిజల గ్రామానికి చెందిన రామాంజులు (27) ద్విచక్ర వాహనంలో గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా ఆవు అడ్డం వచ్చింది. దీంతో ద్విచక్ర వాహనం బోల్తా పడి రామంజులు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ రామంజులును స్థానికులు పుంగనూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.