పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో శనివారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మండలంలోని బండ కింద పల్లి పంచాయతీలో టిడిపి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టిడిపి సభ్యత్వం వల్ల కలుగు ప్రయోజనాల గురించి చల్లా రామచంద్ర రెడ్డి తెలిపారు.