పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ శనివారం పసుపు అలంకారంలో నారాయణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించింది. ఉదయన్నే అర్చకులు అభిషేకాలు, అలంకరణ,కుంకుమార్చన లతో పాటు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పుంగనూరు ప్రజలు తమ ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరుపాక్షి మారెమ్మను దర్శించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను కమిటీ సభ్యులు అందజేశారు.