ఉత్తమ విద్యార్థులకు లక్ష 65 వేల నగదు పురస్కారం

62చూసినవారు
ఉత్తమ విద్యార్థులకు లక్ష 65 వేల నగదు పురస్కారం
వెంకటాచలం మండలం లోని నిడిగుంటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 11 మంది విద్యార్థులకు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి ఫౌండేషన్ రూ. 1. 65 లక్షలను గురువారం అందచేసింది. పాఠశాలలో గత ఏడాది ఒకటి నుండి ఐదు స్థానాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన 11 మందికి ఈ నగదు పురస్కారం అందచేశారు. ఒక్కో విద్యార్థికి రూ 11 వేల చొప్పున ఈ పురస్కారం అందచేశారు.

సంబంధిత పోస్ట్