సర్వేపల్లి: లిక్కర్ మాఫియా డాన్ గా సోమిరెడ్డి: కాకాణి ధ్వజం
సర్వేపల్లి నియోజకవర్గంలో మద్యం దుకాణాల నుంచి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చందాలు వసూలు చేస్తున్నారని మాజీమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం మాఫియా పై విచారణ కోరే దమ్ము సోమిరెడ్డికి ఉందా అంటూ ప్రశ్నించారు.