సత్యవేడు నియోజకవర్గం నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో శనివారం భక్తులకు దాతలు జయకుమార్, సునీల్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానికులు అన్నదానం స్వీకరించారు. దాతలు ఆలయంలో శనివారం పర్వదినాలలో భక్తులకు అన్నదాన ఆనవాయితీగా చేస్తూ ఉంటారు. శనివారం మధ్యాహ్నం ఆలయ ఇన్స్పెక్టర్ చంగల్ రాయులు పర్యవేక్షణలో గోవింద నామస్మరణ మధ్య అన్నదాన కార్యక్రమం జరిగింది.