పిచ్చాటూరు: ఆరనియారు ప్రాజెక్టును సందర్శించిన జేసీ

76చూసినవారు
సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరులోని ఆరనియారు ప్రాజెక్టు వద్ద తుడా నిధులతో చేపడుతున్న టూరిజం పనులను తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులతో కలిసి చర్చించారు. అరనియార్ ప్రాజెక్టు పర్యాటక ప్రాంత అభివృద్ధికి అనుకూలంగా ఉందని ఆయన అన్నారు. అధికారులు, గుత్తేదారుతో ఆయన మాట్లాడారు. త్వరలోనే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్