వైభవంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి రథోత్సవం

84చూసినవారు
వైభవంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి రథోత్సవం
నారాయణవనలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు గురువారం రథోత్సవం జరిగింది. మధ్యాహ్నం అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు అభిషేకాలు పూజలు నిర్వహించి రథంపై సుందరంగా అలంకరించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవం ఘనంగా జరిగింది. గ్రామంలో భక్తులు కర్పూర హారతులిచ్చి మొక్కులు సమర్పించారు.

సంబంధిత పోస్ట్