సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండల కేంద్రంలోని శ్రీకాళహస్తి రోడ్డు కూడలిలో శనివారం ఉదయం నందమూరి తారక రామారావు వర్ధంతి నిర్వహించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్యఅతిథిగా పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. పేద ప్రజలకు స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను గురించి వివరించారు. ఆయన పథకాలే నేడు ఆదర్శంగా నిలిచాయన్నారు