శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని వెంకటేశ్వర స్వామి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం పుష్పాలంకరణ చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నూతన సంవత్సరం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.