శ్రీకాళహస్తి పట్టణం గాంధీ వీధికి చెందిన వరలక్ష్మి అనే మహిళ సోమవారం నుంచి అదృశ్యమైందని ఆమె భర్త హరికుమార్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలకంఠేశ్వర స్వామి దేవాలయంకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదని తెలిపారు. బంధువులు, స్నేహితులను విచారించినప్పటికీ ఆచూకీ లభించలేదన్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.